Home » చిన్నపిల్లల మల్టీ సూపర్ హాస్పిటల్ ను నిర్మించనున్న టీటీడీ

చిన్నపిల్లల మల్టీ సూపర్ హాస్పిటల్ ను నిర్మించనున్న టీటీడీ

by Admin
1.5kViews

*చిన్నపిల్లల మల్టీ సూపర్ హాస్పిటల్ స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్

*టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

తెలంగాణ మిర్రర్, తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్టత్మాకంగా నిర్మించనున్న చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం పరిశీలించారు. రుయా ఆసుపత్రి ఆవరణంలో ఆరున్నర ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి  అధికారులతో కలసి స్థల పరిశీలన చేసి అక్కడ జరుగుతున్న భూమి చదును చేసే పనులను ఆరా తీశారు. రుయా ఆసుపత్రి నుంచే కాకుండా జూపార్కు రోడ్డు నుంచి కూడా ఈ ఆసుపత్రికి ప్రవేశ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. దీంతోపాటు భారతీయ విద్యా భవన్ మార్గం లో నుంచి కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సుమారు రూ 240 కోట్లతో చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందన్నారు. టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూ కు పంపారనీ, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగనోహ్మన్ రెడ్డి టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలోనే ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేయిస్తామని చైర్మన్ చెప్పారు.

ఈ కార్యక్రమం లో టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్టేట్ విభాగం ఓఎస్డి  మల్లిఖార్జున ఇతర అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment