
1.3kViews
గచ్చిబౌలి (తెలంగాణమిర్రర్): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండ లో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ క్లబ్ ను బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాయ్ క్లబ్ ను ఏర్పాటు చేయడంతో స్థానికులకు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరం అని అన్నారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి, వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , చాయ్ క్లబ్ యాజమాన్యం, రాజేందర్, సురేష్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, వెంకటేష్, ప్రభాకర్, మన్నే రమేష్, రంగస్వామి, వెంకట్, నర్సింగ్ రావు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.