Home » చదువు పక్కన పెట్టి…డ్రగ్స్ అమ్ముతూ దొరికాడు

చదువు పక్కన పెట్టి…డ్రగ్స్ అమ్ముతూ దొరికాడు

by Admin
9.7kViews
75 Shares

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలిస్తున్న డ్రగ్​ పెడ్లర్​​ను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్, ఒక మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలించి అమ్ముతున్న సూడాన్​ దేశానికి చెందిన ​డ్రగ్​ పెడ్లర్​ను​​,హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. సూడాన్​ దేశానికి చెందిన మహ్మద్ యాకుబ్ భారత దేశానికి చదుకోవడానికి వచ్చాడు. కానీ చదువు ముసుగులో అక్రమంగా బెంగళూరు నుంచి డ్రగ్స్​ తరలించి హైదరాబాద్​లో అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు పాతబస్తీ, ఫలక్​నుమా పోలీసులు, హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ అధికారులతో కలిసి చేపట్టిన జాయింట్​ ఆపరేషన్​లో ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో నిందితుడు పట్టుపడ్డాడు. యాకుబ్ గతంలో హైదరాబాద్​లోనే ఉండేవాడని అతనిపై రాజేంద్రనగర్​, కుషాయిగూడ పోలీస్ స్టేషన్​లో కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్,ఒక మొబైల్​ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment