
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గురువారం సందర్శించారు.ఈ మేరకు అధికారుల పనితీరును పరిశీలించారు.వార్డు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముచ్చటించారు..సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను వేంటనే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించాలని వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, గురుచరణ్ దుబే, పబ్బా మల్లేష్ గుప్తా , అక్బర్ ఖాన్,నరేందర్ భల్లా, సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు