Home » చందానగర్ లో10 వ తరగతి విద్యార్థిని అదృశ్యం

చందానగర్ లో10 వ తరగతి విద్యార్థిని అదృశ్యం

by Admin
1.4kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు,సోదరి తెలిపిన వివరాల ప్రకారం లింగంపల్లి రైల్వే స్టేషన్ 6 వ నంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద ఉన్న గుడిసెల పక్కన నివాసం ఉంటున్న జ్యోతి ఆమె సోదరి పుట్టల తులసి వద్ద ఉంటూ 10 వ తరగతి చదువుతూ వేరొకరి ఇంట్లో పని చేస్తుంది.కాగా జ్యోతి గత నెల 20 న పనికి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోయేసరికి తన సోదరి పనిచేసే ప్రదేశానికి వెళ్లి విచారించగా ఆమె ఆ రోజు పనికి రాలేదని చెప్పారు.ఆమె సోదరి కోసం పుట్టల తులసి అన్ని పరిసరాలు,వేరే ప్రదేశాలలో వెతికినా ఆమె జాడ తెలియక పోవడంతో తులసి చందానగర్ పోలీసులను ఆశ్రయించింది.తన చెల్లెలు జ్యోతి పాపిరెడ్డి కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తో పరిచయం ఉందని వారి ఇద్దరినీ పలు మార్లు చూశానని కాగా ఈ విషయంలో తన చెల్లిని హెచ్చరించానని పోలీసులకు తెలిపింది.కాగా తన చెల్లి జ్యోతి చంద్రశేఖర్ తో వెళ్లి ఉంటుందని అనుమానం ఉందని తెలిపింది.ఈ మేరకు జ్యోతి అక్క తులసి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment