
11.0kViews
111
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ లో భారీగా నగదు పట్టుబడింది.తనిఖీలలో భాగంగా ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.99 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సీజ్ చేసిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగించారు.కాగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు.