
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: టీపీయుఎస్ఎస్ నూతన కార్యాలయాన్ని చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ నెల 24 నుండి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామ యాత్రకు తమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. యాత్ర విజయవంతం చేసేందుకు ప్రథమ భూమిక వహిస్తామని రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికిరణ్ ,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లలిత,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిట్టా రెడ్డిప్రసాద్, గ్రేటర్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చారి, కమిటి సభ్యులు భరత్ రాజ్, గోవర్ధన్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీను, శ్రీధర్, రామకృష్ణారెడ్డి, శేరిలింగంపల్లి అధ్యక్షులు అశోక్ ముదిరాజ్, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు గాయత్రి , నివేదిత తదితరులు పాల్గొన్నారు.