Home » చందానగర్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గాంధీ

చందానగర్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గాంధీ

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.సమాజంలో అస్పృశ్యతను నివారిర్చడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్ ,లక్ష్మీనారాయణ గౌడ్ ,మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ తెరాస నాయకులు మిరియాల రాఘవ రావు , విమల్ కుమార్ గంధం రాములు, జనార్దన్ రెడ్డి, డి. వెంకటేష్, సుప్రజా ప్రవీణ్ ,అక్తర్, దొంతి శేఖర్, రఘునాథ్,పి.వై.రమేష్,అక్బర్ ఖాన్,ఓ.వెంకటేష్,అంజద్ పాషా, నాగరాజు,కార్తిక్ గౌడ్,యశ్వంత్,ప్రవీణ్ రెడ్డి,నరేందర్,అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఛైర్మెన్ విమల్ కుమార్,కంది అశోక్,కంది జ్ఞానేశ్వర్, రాఘవేందర్, నర్సింగరావు,నవీన్, ఉదయ్ ,అర్జున్,కృష్ణ,నరేందర్,రాజ్ కుమార్,మహేందర్,రవి,రజిని,వరలక్ష్మీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment