
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన సతీమణి శ్యామలాదేవి అన్నారు.గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, సిబిఆర్ ఎస్టేట్స్ , అట్లాంటిక్ సిటీ,ఆదర్శ్ నగర్, శాంతి నగర్ కాలనీలలో ఆమె కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్బంగా శ్యామల దేవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్‌ఎస్ ధ్యేయమని తెలిపారు.ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గాంధీని ఆశీర్వదించాలని,భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్త్రాలని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు ఇలా చెప్పుకుంటే పోతే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు సోపానమన్నారు.ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, చంద్రిక ప్రసాద్, మాధవి, పృథ్వి, రాధిక, ప్రణీత, కుమార్, సునీత,మీనా ,హరిత, రాజేశ్వరి, యుగంధర్, రజిని, శ్యామల, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.