
శేరిలింగంపల్లి,చందానగర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలని వేమన వికర్ సేక్షేన్ కాలనీ, కేఏస్అర్ లేఔట్ లలో శేరిలింగంపల్లి జోన్ జలమండలి శాఖ జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు..కాలనీలలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించారు. కాలనీలలో మురికి నీరు రోడ్లపై రాకుండా సమస్యలను జలమండలి అధికారులు సిబ్బంది వేంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డిని కోరారు. చందానగర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పని చేయడం జరుగుతుందన్నారు..డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో సిసిరోడ్డు పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందని..కోన్ని కాలనీలో పుర్తి చేయడం జరిగిందన్నారు..స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి బిఆర్ఏస్ పార్టీ నాయకులు కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.