Home » చందానగర్ డివిజన్ పరిధిలోని పలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గాంధీ

by Admin
380Views

తెలంగాణ మిర్రర్, చందనగర్:  చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీ లలో లక్షల 4 కోట్ల 9 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులకు జిహెచ్ఎంసి అధికారులు, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో  మంత్రి కెటిఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ అభివృద్ధికి కోసం శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా యుజిడి పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,  ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఆయన తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు.  నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు:

1. వేముకుంట వద్ద రూ. 18.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

2. రోడ్ నంబర్, 3,4,5&6. వేమన కాలనీ లో రూ. 20:00 లక్షల అంచనా వ్యయం* తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

3. విద్య నగర్ & ఫ్రెండ్స్ కాలనీ లో రూ. 25.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

4. జవహర్ కాలనీ లో రూ. 30.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

5. కైలాష్ నగర్ లో రూ. 20:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

6. రోడ్ నంబర్ 6, జవహర్ కాలనీ లో రూ. 20:00 లక్షల అంచనా వ్యయం తో* చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

7. పద్మజ ఎనక్లేవ్ లో రూ. 20:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

8. సురక్ష ఎనక్లేవ్ లో రూ. 35:00. లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే RCC పైప్ లైన్ నిర్మాణ పనులు..

9.  రాయల్ టైలర్ నుంచి సిటిజన్ కాలనీ వరకు రూ. 12:00 లక్షల అంచనా వ్యయం తో* చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

10. తార నగర్ బస్తి లో రూ. 20:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

11.  పూర్ణిమ టవర్ వద్ద రూ 12:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..
12. ఇందిరా నగర్ లో రూ. 20.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

13. నాగార్జున స్కూల్ నుంచి బి, ఆర్ గ్యాస్ వరకు రూ. 35:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే RCC పైప్ లైన్ నిర్మాణ పనులు..

14. దీప్తి నగర్ కాలనీ లో రూ. 22.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

15. ఆర్ .ఎస్ బ్రదర్స్, శ్రీ రాం నగర్ లో రూ. 30:00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..
16. కె ఎస్ ఆర్ ఎనక్లేవ్ లో 45.00 లక్షలు లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే UGD పైప్ లైన్ నిర్మాణ పనులు..

17. శంకర్ నగర్ మెయిన్ రోడ్ వద్ద రూ. 25.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే RCC పైప్ లైన్ నిర్మాణ పనులు..ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు దాసరి గోపి, కరుణాకర్ గౌడ్, వెంకటేష్ ముదిరాజు, గురు చరణ్ దుబే, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మి, ప్రీతమ్, వెంకటేష్, రవీందర్ రెడ్డి, మల్లేష్, గోవర్ధన్, అక్బర్ ఖాన్, పారునంది శ్రీకాంత్, హరీష్, దాస్, యూసఫ్, అంజద్ పాషా, కొండల్ రెడ్డి, బోస్, ప్రవీణ్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ , బిగనా, నీలకంఠ రెడ్డి , Dr రాజు , రఘునాథ్ రెడ్డి, రషీద్ , నర్మెద్ర భల్లా వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment