Home » ఘనంగా సామూహిక లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు

ఘనంగా సామూహిక లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు

by Admin
1.5kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  శ్రీ శారదా పీటపాలిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సముదాయంలోని శ్రీ భవాని శంకరాయలంలో కార్తీక మాసం సందర్బంగా శనివారం శివలింగానికి సామూహిక లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గం 15 నింలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసం.10 గం 30 నిం లకు ఏకాదశ రుద్రాభిషేకం, 11 గం 30 నిం లకు అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గం 30 లకు కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయం గర్భగుడిలోని శివలింగానికి ఆవు పాలు, ఆవు నెయ్యి,పట్టుతేనె,ఆవు పెరుగు, పంచదార, ద్రాక్ష రసము, బత్తాయి, మామిడి పండ్ల రసాలు, గంధం, విభూది, అన్నాభిషేకం, మహా కలశ కుంభాభిషేకం, సామూహిక లక్ష బిల్వార్చన,లక్ష కుంకుమార్చన చేపట్టారు. అనంతరం శివుడికి శాంతి కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

You may also like

Leave a Comment