
1.2kViews
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: చందానగర్ విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో 26వ షడ్విoశ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సత్యసాయి ఆచార్యుల వారిచే ఉదయం 10 గం 30 నిం లకు విస్వక్షేన పూజ,పుణ్యాహవాచనం దీక్షాధారణ చేశారు. సాయంత్రం 5 గం లకు పుట్ట బంగారం తీసుకొచ్చి అంకురార్పణ చేసి అగ్నిమధనం,అగ్ని ప్రతిష్టాపన,ధ్వజారోహణ నిర్వహించారు.సాయంత్రం 6 గం లకు స్వామి వారిని శేషవాహన సేవ నిర్వహించారు.రాత్రి 9 గంటలకు హారతి,తీర్దప్రసాదములు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.