
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాలు మేరకు 104 కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మహిళా బంధు – కేసీఆర్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా పారిశుధ్య కార్మికులు, అంగనవాడి వర్కర్స్, ఎఎన్ ఏంలు, స్వయం సహాయక మహిళా నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి సోదరభావంతో రాఖీ కట్టారు. అనంతరం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మహిళా పారిశుధ్య కార్మికులు, అంగనవాడి వర్కర్స్, ఎఎన్ ఏంలు, స్వయం సహాయక మహిళా నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలకు శాలువాలతో సన్మానం చేసి, వారికి చీరలను పంపిణి చేశారు. కేసీఆర్ అక్కచెల్లమ్మల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో తెలంగాణ రాష్ట్రంలోని ఆడ బిడ్డలు ఎంతో సంతోషంగా ఉన్నారని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఒక అన్నలా ఉంటూ, తల్లులకు పెద్ద కొడుకుల ఉంటూ, మహిళలకు ఎంతో చేయూతను అందిస్తున్నారని హమీద్ పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, నిర్మల, రూపరెడ్డి, బాలమణి, శ్యామల, కవిటి లక్ష్మి, రఫియా బేగం, హాలీమా బేగం, ఆషియా బేగం,విజయశాంతి, నర్సిన్ బేగం, లక్ష్మికాంతం, నాగశ్రీలత, కళ్యాణి, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.