
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం వివేకానంద్ నగర్ లోని ఆయన నివాసంలో అభిమానులు,తెరాస నాయకులు,కార్యకర్తలు మధ్య ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా ఆయనను కార్పొరేటర్లు,వార్డ్ మెంబర్ లు పుష్ప గుచ్చం అందజేసి ,శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.చందానగర్ డివిజన్ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా,డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు విప్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తనపై అభిమానులు, కార్యకర్తలు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞుడనని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.