Home » ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

by Admin
590Views

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి:  ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్బంగా శంకర్ పల్లి మున్సిపా ల్ కార్యాలయంలో కాళోజి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించిన  మున్సిపల్ ఛైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని జీవితాంతం పేదల పక్షాణ నిలిచిన కవి అని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్స్ చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, పార్శి రాధా బాలకృష్ణ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment