
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో మంగళవారం మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానికులతో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ సామాన్య రైతుబిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీఆర్ నిరూపించారని అన్నారు. 60 ఏళ్ళ వయసులోరాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలను సాధించారని గుర్తు చేశారు. సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని,చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారని చెప్పారు.ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ ను ఎవరూ మరిచిపోరన్నారు.ఈ కార్యక్రమంలో స్థానికులు బలరాం,గంగాధర్ రావు,ప్రతాప్ రెడ్డి,శ్రీనివాస్ రావు,రమేష్,డేవిడ్,నరేంద్ర,మురళి, వెంకటేష్,శివ,బాబు రెడ్డి,రాంబాబు,సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.