Home » గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న డ్రగ్స్ పట్టివేత…..ముగ్గురు అరెస్ట్ ….

గోవా నుండి హైదరాబాద్ తరలిస్తున్న డ్రగ్స్ పట్టివేత…..ముగ్గురు అరెస్ట్ ….

by Admin
440Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : గోవా నుండి హైద్రాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. నిందితుల నుండి 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్‌బాసీ మాత్రలు,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ. 26 లక్షల 28 వేలు ఉంటుందని అన్నారు. జాపూద్ అలియాస్ జూడ్ గోవా నుండి హైద్రాాబద్ కు డ్రగ్స్ తీసుకొచ్చాడని సీపీ తెలిపారు.నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. హైద్రాబాద్ లోని టోలి‌చౌకీకి చెందిన మహమ్మద్ అష్రఫ్ వద్ద 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టుగా తెలిపారు.హైద్రాబాద్ నిజాంపేటకు చెందిన రామేశ్వరం శ్రవణ్ కుమార్ నుండి గ్రాము కొకైన, ప్రకాశం జిల్లాకు చెందిన చరణ్ తేజ నుండి మరో గ్రాము కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నట్టుగా సీపీ వివరించారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 202 డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు 419 మంది నిదితులను అరెస్ట్ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిఘా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. దీంతో ఎక్సైజ్ , పోలీసు శాఖలు సంయుక్తంగా వేర్వేరుగా కూడా ఆపరేషన్స్ ను నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘాను ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డ్రగ్స్ విక్రయం జరిగే అవకాశం ఉందని పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. గత వారంలోనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళా టెక్కీ కూడా ఉన్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

You may also like

Leave a Comment