Home » గోకుల్ ప్లాట్స్ లో పర్యటించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

గోకుల్ ప్లాట్స్ లో పర్యటించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

by Admin
9.8kViews
73 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో ఆయన పర్యటించి,చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కాలనీ సభ్యులతో సమీక్షించిన అనంతరం నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్,నాయకులు నాగేశ్వరరావు,ప్రభాకర్, సాంబయ్య, ప్రసాద్, సత్యం, ప్రకాష్ రెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment