Home » గుల్మహర్ పార్క్ లో వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన వి.గంగాధర్ రెడ్డి

గుల్మహర్ పార్క్ లో వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన వి.గంగాధర్ రెడ్డి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మహర్ పార్క్ లోని గ్రంధాలయం లో పెప్సికో & సీడ్స్ (సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోలాజికల్ డెవలప్‌మెంట్ సొసైటీ),  సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో రెయిన్బో హాస్పిటల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లకు ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ ను స్థానికంగా ఉన్న కమిటీ హాల్లు, ఫంక్షన్ హాల్లు, స్కూళ్ళలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు దూరం వెళ్లకుండా ప్రజలకు చేరువగా అనేక సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాము అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా వాక్సినేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి చేస్తున్నాము అన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్కువ సేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక్కో సెంటర్‌ ద్వారా రోజుకి 200 నుంచి 250 మందికి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్  , గుల్మొహర్ పార్క్ కాలనీ జెనరల్ సెక్రెటరీ నిరజన్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, ఆఫీస్ బీరెర్స్ శేకర్ రావు, సింగ్ సాయి , నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్,సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజర్ ఇంది రా భారతి, రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది షరీఫ్ , ముజ్జమిల్, రికీ, కల్యాణి, జ్యోతి, ఖాజా, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి , రాయుడు, వినయ్, నర్సింగ్ రావు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment