Home » గుట్టలబేగం పెట్ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ గాంధీ

గుట్టలబేగం పెట్ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
1.2kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ గుట్టలబేగం పెట్ వడ్డెర బస్తీలో ఇటీవల కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే.కాగా బుధవారం మృతుల కుటుంబ సబ్యులకు  చెరో 5 లక్షల రూపాయలను సొంతంగా  ప్రభుత్వ విప్ గాంధీ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్,డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ లు మృతి చెందిన  చిన్న బీమయ్య  భార్య గంగమ్మకు అదేవిధంగా  కన్నమ కొడుకు ఈశ్వర్,ప్రభులకు  అందజేశారు.అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు మృతి చెందిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.చిన్న బీమయ్య పిల్లలను గురుకుల పాఠశాలలో చదువుకునేల చూస్తామని,భార్య గంగమ్మ ఉద్యోగం చేస్తాను అంటే తనకు సరైన ఉద్యోగం వచ్చేలా చూస్తామని, కన్నమ భర్తకు పెన్షన్, వారి కుటుంబానికి అండగా ఉంటామని,బస్తీలో నూతన మంజీర పైప్ లైన్ పనులు కూడా పూర్తి చేశామని,ప్రతి ఇంటికి నూతన నల్ల కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందిస్తామని తెలిపారు.అనంతరం బస్తీలో నూతనంగా చేపట్టినా మంజీర పైప్ లైన్ పనులను పరిశీలించారు.అనంతరం బస్తీలో నూతనంగా చేపట్టినా మంజీర పైప్ లైన్ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు సాంబయ్య,యాదగిరి,శ్రీను,వీరేష్,గంగాధర్,పెద్ద బీమయ్య, రంగయ్య,ఈశ్వర్,ప్రభు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment