Home » గుండె ఆగిపోయిన వారికి సిపిఆర్ చేసి కాపాడుకోవచ్చు : మంత్రి హరీష్ రావు

గుండె ఆగిపోయిన వారికి సిపిఆర్ చేసి కాపాడుకోవచ్చు : మంత్రి హరీష్ రావు

by Admin
11.6kViews
140 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో దుర్గంచెరు వద్ద నిర్వహించిన సర్వేలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల పై ప్రచారం కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈరోజు వరల్డ్ హార్ట్ డే గా నిర్వహిస్తుంటారని తెలిపారు.ఉన్నట్టుండి గుండె పనిచేయటం ఆగిపోయిన వారిని సీపీఆర్ చేయటం ద్వారా కాపాడుకోవచ్చని హరీశ్ రావు అన్నారు. కానీ.. అత్యంత అవసరమైన సీపీఆర్ గురించి దేశంలో 98 శాతం మందికి తెలియకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజలకు సీపీఆర్​లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందుకోసం 1262 ఏఈడీ మిషన్లు కొనుగోలుచేసి అన్ని సీహెచ్ సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు.ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీతో బాధపడుతున్నట్లు తేలిందని చెప్పారు. ప్రభుత్వం బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందిస్తుందని వెల్లడించారు.

You may also like

Leave a Comment