
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గిరిజనుల ఆరాధ్యదైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు యోగనంద్ పాల్గొని మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంకోసం హిందు ధర్మంకోసం ఆయన చేసిన సేవలు కొనియాడారు.గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేశారని అన్నారు. కేవలం గిరిజనుల అభ్యున్నతి కోసమే కాకుండా భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు అని కొనియాడారు.అలాగే సేవాలాల్ మహరాజ్ మానవ మాతృడు కాదు అని దైవసంశ సంభూతులు అన్నారు.దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, దశరథ్, సీతారాం నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు మణిక్ రావు,శ్రీధర్ రావు,విజేందర్,ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ,రవీందర్ నాయక్, వినోద్,ప్రభాకర్, పాపయ్య, కళ్యాణ్, శ్రీను, వెంకట్, నాయకులు తండా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.