Home » గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలి – గంగాధర్ రెడ్డి

గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలి – గంగాధర్ రెడ్డి

by Admin
400Views

>భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి.

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో  రాయదుర్గం లోని వార్డ్ ఆఫీస్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా గాంధీ జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. అనంతరం  గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ చూపిన అహింసామార్గంలో అంతా నడవాలని అన్నారు. అహింసే ఆయుధంగా గాంధీజీ తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టారని అన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అహింసా సత్యాగ్రహం అన్న రెండు గొప్ప ఆయుధాలు ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావులు గాంధీ. గాంధీజీ నాయకత్వంలో భారతీయులు స్వాతంత్ర్యం పొందారు, కానీ ఆయన స్వచ్ఛ భారత్ కల స్త్రీలకు భద్రతా స్వేచ్ఛ ఇప్పటికీ మన భారతదేశంలో నెరవేరలేదు. స్వాతంత్ర్యం కంటే పరిశుభ్రత చాలా ముఖ్యం అని మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ జీవన విధానంలో పరిశుభ్రత పరిశుభ్రతను ఒక అంతర్భాగంగా మార్చారు. అందరికీ పూర్తి పరిశుభ్రత అనేది అతని కల ఇది మన భారతీయులందరి బాధ్యత అని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, డివిజన్ ఎక్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్ రాజు, గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, దయాకర్, తిరుపతి, ఎన్టీఆర్ నగర్, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు, కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, నరేందర్ ముదిరాజ్, శంలేట్ గోపాల్,సంజీవ్ , శంలేట్ విజయ్,రమేష్ యాదవ్, జగయ్య, వరలక్ష్మి, ఇందిరా, నిఖిల్ యాదవ్, అశోక్ యాదవ్, శివ, ప్రవీణ్ వెంకటేష్, దుర్గరామ్, రాము యాదవ్, శివ, శంలేట్ రాజు, సురేందర్, సతీష్ గౌడ్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, గోపాల్, మన్నే రమేష్, రంగస్వామి, శ్రీకాంత్, టీంకు, శివ, వెంకటేష్, రాజు  శ్రీను, విష్ణు, క్రాంతి, నర్సింగ్ రావు, గోవర్ధన్ కార్యకర్తలు, కాలనీ వాసులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment