
*తెరాస నాయకులు,కార్యకర్తలతో కలిసి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : మహాత్ముడు చూపిన దారిలో మనమందరం నడవాలని రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ అన్నారు.ఆదివారం మహాత్మా గాంధీ వర్థంతి సందర్బంగా రామచంద్రపురం బాలవిహార్ పార్క్ లోని గాంధీ విగ్రహానికి కార్పొరేటర్ పుష్ప నగేష్ పూలమాల వేసి డివిజన్ తెరాస పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని అన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్,సీఎం మల్లేష్, అనుబంధ సంస్థ నాయకులు పెద్దరాజు,ప్రీతి గౌడ్,ఉష,ధనసిరి ప్రకాష్,కరికే అశోక్,మహేందర్ సింగ్,నరసింహ,సరిత జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.