
400Views
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ ఆటో స్టాండ్, బీరంగూడ గుట్ట కామన్, శ్రీరాంనగర్ కాలనీ, టైలర్స్ కాలనీ,బీరంగూడ,ఎన్.ఆర్.ఐ శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇందిరమ్మ తదితర కాలనీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్‌పూర్ 15వ వార్డు సభ్యురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ముందుగా మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్లోర్స్ లావణ్య శశిధర్ రెడ్డి ,మున్నా, విజయ్, నాయకులు శ్రీనివాస్,సుధాకర్, ప్రకాష్, సత్యనారాయణ,రమేష్ యాదవ్,మహేష్, మహిపాల్ రెడ్డి,భిక్షపతి,మల్లేష్,ఈశ్వర్ రెడ్డి,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.