
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గజ్జల యోగానంద్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో స్థానిక జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ మదీనాగూడ, చందానగర్ నందు అక్టోబర్ 1 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ జాబ్ మేళాలో 50 కి పైగా కంపెనీలు,ఐటి, సాఫ్ట్ వేర్, నాన్ ఐటీ,బ్యాంకింగ్, ఫైనాన్స్,ఫార్మా, టెక్నికల్, కోర్ జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్/హాస్పిటల్, సేల్స్/ మార్కెటింగ్, లాజిస్టిక్స్, బిపిఒ/కెపిఓ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలు పాల్గొంటాయని గజ్జల యోగానంద్ ఓ ప్రకటనలో తెలిపారు.పదవతరగతి, ఐటిఐ,డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బి.టెక్, ఎంసిఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ వివిధ కోర్సులు చదివి, ఉద్యోగ అన్వేషణలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యోగానంద్ పిలుపునిచ్చారు.సుమరు 2 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని, పదవ తరగతి ఆపై అర్హతలు ఉన్నవారు, వారికీ సంబందించిన రంగాలలో అనుభవం ఉన్నవారికి మరియు లేనివారికి కుడా అవకాశం ఉంటుంది అని, యువత తమ ఎంచుకున్న రంగాలలో మరీంత అనుభవం పెంపొందించడానికి వివిధ రంగాల నిపుణులచే కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జాబ్ మేళ లో పాల్గొనదలచిన వారు కింద ఇవ్వబడిన గూగుల్ ఫార్మ్ https://forms.gle/