Home » గచ్చిబౌలి రాయదుర్గంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట

గచ్చిబౌలి రాయదుర్గంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట

by Admin
360Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రాయదుర్గం లో ప్రజా సమస్యలపై బస్తీ బాట లో భాగంగా కాలనీలో సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి గారు.అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలు డ్రైనేజీ,మంచి నీళ్లు,రోడ్ల సమస్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని కార్పొరేటర్ దృష్టికి, స్థానిక ప్రజలు తెచ్చారు.దీంతో వెంటనే స్పందించిన కార్పొరేటర్ జలమండలి మేనేజర్ నరేందర్ రెడ్డి తో మాట్లాడుతూ వెంటనే పైప్లైన్ చెక్ చేసి సరి చేయాలనీ అవసరమైతే కొత్త పైప్ లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అధికారులను కోరారు.నిర్మాణంలో అభివృద్ధి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాలనీ వాసులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి,గచ్చిబౌలి డివిజన్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్,రంగారెడ్డి జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ నీరుడి సురేష్,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,డివిజన్ ఎక్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్ రాజు,గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్,గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ముదిరాజ,అంబటి అశోక్,దయాకర్,గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర,వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్,స్వామి గౌడ్,నరేందర్ యాదవ్,విజయ్ శ్యామ్ లెట్,నరసింహా రాజు,శ్రీనివాస్ యాదవ్,శ్యామ్ యాదవ్,రమేష్ యాదవ్,శ్యామ్ లెట్,దుర్గరామ్, ప్రవీణ్, విజయ్,వినయ్, సతీష్ గౌడ్, హరీష్ శంకర్ యాదవ్,కిషన్ గౌలి, ప్రసాద్,శ్రీను,రాయదుర్గం కాలనీ వాసులు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment