
*ఆర్డీఓ,ఎంఆర్ఓ,కార్పొరేటర్లతో కలిసి మంజూరు పత్రాలను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ లో ఇటీవల గుడిసెలు కోల్పోయిన బాధితులకు ఇండ్ల మంజూరి పత్రాలను శుక్రవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రకళ,తహసీల్దార్ వంశీ మోహన్ లతో కలిసి ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ 50 మంది లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బసవతారక నగర్ లో ఇటీవల గుడిసెలు కోల్పోయిన బాధితులు సరైన న్యాయం చేయాలని తమకు వినతి పత్రం అందజేసిన విషయం విదితమే. కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని,కాగా కోర్ట్ పరిధిలో స్టే తో తమకు ఎటువంటి సంబంధం లేదని తమకు సరైన న్యాయంచేసి ఇండ్ల ను కేటాయించేలా చూడాలని కోరగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశామని,దీనిని దృష్టిలో పెట్టుకొని అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ పథకాలలో ఇండ్ల ను మంజూరి చేస్తూ మంజూరి పత్రాలను అందజేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అదేవిధంగా ఎంతో కాలంగా బసవ తారక నగర్ లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బంది కలిగే వింధంగా రెవిన్యూ సిబ్బంది గుడిసెలు తొలగించండం బాధాకరం. అయినప్పటికీ 2014 లో తానూ సొంత డబ్బులతో త్రాగు నీటికి బోరు వేయించానని గాంధీ తెలిపారు. అప్పుడు 11 గుడిసెలు మాత్రమే ఉండేవని పేద ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతంలో మౌలిక వసతులు కల్గించాలని సదుద్దేశంతో మంచినీటి వసతి వీధిదీపాల లాంటివి ఏర్పాటు చేశామని అన్నారు.పేద వర్గాలకు సరైన న్యాయం తెరాస ప్రభుత్వమని అన్నారు.ఈ సందర్బంగా పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితముగా ఇండ్లు మంజూరి చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,కలెక్టర్ అమోయ్ కుమార్,ఆర్డీఓ చంద్రకళ,ఎంఆర్ఓ వంశీమోహన్లకు ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా,రెవెన్యూ అధికారులు మండల సర్వేయర్ మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి,ఆర్ఐ శ్రీకాంత్,సీనయ్య,గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్ ,టిఆర్ఎస్ నాయకులు సురేందర్,రాగం జంగయ్య యాదవ్,అంజమ్మ, శంకరి రాజు ముదిరాజ్,జగదీష్,రమేష్ గౌడ్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.