Home » గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రఘునాథ్ యాదవ్ స్కూల్ బ్యాగుల పంపిణీ

గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రఘునాథ్ యాదవ్ స్కూల్ బ్యాగుల పంపిణీ

by Admin
12.1kViews
88 Shares

తెలంగాణ మిర్రర్,గచ్చిబౌలి :  చదువుతోపాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని శేరిలింగంపల్లి నియోజవర్గం యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్ అన్నారు.శుక్రవారం రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయన ఉచితంగా స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి చదువుల గురించి ఆరా తీశారు.ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. చదువుతోపాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. రాబోయే భవిష్యత్తు అంతా యువతదేనని అన్నారు. చదువుకొని ఉన్నత ఉద్యోగాలను సాధించాలని, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్, కుమార్ సాగర్, రాములు గౌడ్, భరత్, శ్రీకాంత్ నాయక్, పవన్, సాయిలు, కాజా సాగర్, ఉదయ్, రఘునాథ్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

 

You may also like

Leave a Comment