Home » గచ్చిబౌలి నానక్ రామ్ గూడ దోపిడీ కేసులో…దొరికిపోయిన నకిలీ సిబిఐ దొంగలు

గచ్చిబౌలి నానక్ రామ్ గూడ దోపిడీ కేసులో…దొరికిపోయిన నకిలీ సిబిఐ దొంగలు

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి నానక్‌రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. నిందితులంతా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారే.. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. మరికొందరు పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక నిందితుల నుంచి చోరికి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జశ్వంత్.. బాధితుడు సుబ్రహ్మణ్యం దగ్గరే పనిచేస్తున్నట్టుగా తేల్చారు. జశ్వంత్ తన స్నేహితుడు సందీప్‌తో కలిసి ఈ దోపిడీకి ప్లాన్‌ చేశాడు.. తన యజమాని వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని జశ్వంత్ ఈ ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది.. దొంగతనం చేసినా ఫిర్యాదు చేయడని భావించి ఈ చర్యకు పాల్పడినట్టుగా సమాచారం.. మొత్తం ఎనిమిది మందితో కలిసి ప్లాన్‌ చేసిన నిందితుడు.. ట్రావెల్స్ కారు మాట్లాడుకుని సీబీఐ పేరుతో ఇంట్లోకి దూరారని.. కారు నంబర్‌ ప్లేట్ కూడా మార్చారని.. రెండు నెలల నుంచే ప్లాన్ వేశారని, నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment