Home » గచ్చిబౌలి డివిజన్ లో వైభవంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

గచ్చిబౌలి డివిజన్ లో వైభవంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

by Admin
1.0kViews
*హాజరైన కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : హనుమాన్ జయంతి పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో పలు హనుమాన్ దేవాలయాలలో ముఖ్య అతిధిగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు  చేశారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ   ప్రజలందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.నేడు ఆ సీతారాములకు విధేయుడైన శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.మన భారతదేశంలో మన ధర్మాన్ని మన సంప్రదాయం మనము ఆచరిస్తూ వాటికి గౌరవిస్తూ ఇతర కులమతాల సంప్రదాయాలను కూడా గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం  గ్రామస్థులు, భక్తులు,సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment