Home » గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి : కార్పొరేటర్ వి.గోవర్ధన్ రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి సహకరించాలి : కార్పొరేటర్ వి.గోవర్ధన్ రెడ్డి

by Admin
1.1kViews

*ఎంపీ డా.రంజిత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ వి.గోవర్ధన్ రెడ్డి

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరుతూ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గురువారం చేవెళ్ల ఎం.పీ డా. రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గోపన్ పల్లి తాండ,ఎన్టీఆర్ నగర్ లలో నూతన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి, డివిజన్ లోని గోపన్ పల్లి లోని మెట్లకుంట చెరువు,నానక్ రాంగూడ లోని భగీరమ్మ చెరువులను ఆధునికరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషిచేయాలని ఎంపీని కోరారు.దీంతో సానుకూలంగా స్పందించిన ఎం.పీ.డా.రంజిత్ రెడ్డి డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ ,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి ,ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్,సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి.విటల్,గోపనపల్లి వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్,ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్,సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం,సీనియర్ నాయకులు,దేవేందర్ రెడ్డి,హరీష్ శంకర్ యాదవ్,కిషన్ గౌలి,అరుణ్ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,మన్నే రమేష్,రంగస్వామి, గోపాల్, జితేందర్ సింగ్ ,రాజు, శ్రీను, యాదగిరి,నరేందర్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment