Home » గచ్చిబౌలిలో 2వ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అంతేరా

గచ్చిబౌలిలో 2వ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అంతేరా

by Admin
11.6kViews
120 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విభిన్న రకాల రుచులతో, అసాధారణమైన తెలుగు వంటకాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ అండ్ బార్ మరో నూతన రెస్టారెంట్‌ ప్రారంభంతో తమ సేవలను విస్తరించింది. గచ్చిబౌలి వేదికగా అంతేరా రెండవ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నోరూరించే తెలుగు వంటకాల వేడుక వేడుక అద్భుతమైన రుచులతో పాటు సెలబ్రిటీ హంగులతో ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిలో భాగమైన వంటకాలు, తెలుగు రాష్ట్రాల్లో వారసత్వంగా కొనసాగుతున్న అద్భుతమైన – ఆరోగ్యమైన రుచులకు నిదర్శనంగా అంతేరా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వంటకాల సమ్మేళనాన్ని నగరవాసులకు చేరువ చేయడానికి ప్రత్యేకంగా ‘అంతేరా’ రెస్టారెంట్‌ను ప్రారంభించామని భాగస్వాములు ఆశిష్ రెడ్డి, అనురాగ్ రెడ్డి, అనూహ్య రెడ్డి, మృణాల్ పేర్కొన్నారు. విలాసవంతమైన విందులు, స్థానికంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలను ప్రతిబింభించే వాతావరణంతో గచ్చిబౌలిలో ఈ రెస్టారెంట్‌ను ఆవిష్కరించారు.ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్థ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.., “తానూ అంతేరా కుటుంబంలో భాగమైనందుకు, మరో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఫుడ్‌ స్పాట్‌ ఖచ్చితంగా అన్ని రకాల ఆహార ప్రియులను సంతృప్తి పరుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతం నుండి అక్కడ ప్రాచూర్యం పొందిన విభిన్న రకాల రుచులను నగరంలో అందించడం అభినందనీయం’’ అని తెలిపారు.

You may also like

Leave a Comment