Home » గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, ఒక బ్యాంక్ ఉద్యోగి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, ఒక బ్యాంక్ ఉద్యోగి మృతి

by Admin
440Views

* డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టుకు ఢీకొట్టిన కారు

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్​సీయూ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అదుపుతప్పిన కారు డివైడర్​ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు కాగా.. మరొకరు బ్యాంకు ఉద్యోగి అని సమాచారం.మృతులను బ్యాంకు ఉద్యోగి అబ్దుల్ రహీమ్‌ (25),ఎన్ మానస (22), ఎస్ మానస(22 )లుగా గుర్తించారు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అమీర్‌పేటలోని ఓ వసతిగృహంలో ఉంటున్న ఎన్‌.మాసన(22),ఎం. మానస(21)తో పాటు విజయవాడకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌(25) మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ రహీమ్ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎం.మానస స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

You may also like

Leave a Comment