Home » గచ్చిబౌలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అరెకపూడి గాంధీ

గచ్చిబౌలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అరెకపూడి గాంధీ

by Admin
10.2kViews
66 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో నియోజకవర్గంలో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ నల్ల పోచమ్మ దేవాలయంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాంధీకి స్థానికుల నుండి అపూర్వ మద్దతు లభించింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో నియోజకవర్గంలో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా తమ మ్యానిఫెస్టో ఉందని, సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ, అనిల్, విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, రేణుక, రాజేశ్వరి, బీఆర్ ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment