
తెలంగాణ మిర్రర్, సంగారెడ్డి: చిన్న శంకరం పేట మండలం గవ్వల పల్లి గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు తారసపడగ అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా ఐదు గంజాయి ప్యాకెట్లు లభించినట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో చేగుంట మెదక్ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా గవ్వల పల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన కృష్ణ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు కృష్ణ ను అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద గంజాయి పొట్లాలు లభించడంతో ఇంటివద్ద సోదాలు చేయగా గంజాయి చెట్లు కనిపించడంతో వాటిని తొలగించారు అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ గవ్వల పల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గవ్వల పల్లి పంచాయతీ పరిధిలోని ఆగ్రహారం గ్రామానికి చెందిన కృష్ణ వద్ద 5 గంజాయి పొట్లాలు ఉండడంతో అతని ఇంటి వద్ద సోద చేయడంతో గంజాయి చెట్టు కనిపించాయని వాటి తొలగించినట్లు ఎస్సై గౌస్ తెలిపారు అదేవిధంగా మండలంలో గంజాయి తో పాటు ప్రభుత్వ నిషేధిత గుట్కా లు కూడా ఎవరైనా అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సై మహమ్మద్ గౌస్ ట్రైనింగ్ ఎస్ఐ భానుచందర్ గౌడ్ సిబ్బంది వీరన్న, వెంకటేష్, గౌస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.