Home » గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

by Admin
10.5kViews
84 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :   గంజాయి చాక్లేట్లు విక్రయిస్తున్న ఇద్దరినీ డీటీఎఫ్‌ శంషాబాద్ ,శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం శేరిలింగంపల్లి సీఐ లక్ష్మణ్ గౌడ్ ఎక్సైజ్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా మాదాపూర్ లో ఆయా పాన్ షాపుల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.ఈ మేరకు శంషాబాద్‌ డీటీఎఫ్‌ ,శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా మాదాపూర్‌లో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ పాన్ షాపులో రెండు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా గుర్తించి ప్రశాంత్ కుమార్ పరిదా(30), బిజయ్ గురు(30) ను అరెస్టు చేశారు. వీరు ఒరిస్సా కు చెందినవారు. మాదాపూర్ చందా నాయక్ తండాలో వారు పాన్ షాప్ లు నిర్వహిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి, ఒక్కో పాకెట్‌లో 40 గంజాయి మిక్స్‌డ్ చాక్లెట్లు ఉన్న 39 పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ చాక్లెట్ల మొత్తం బరువు (7) కిలోలు ఉన్నట్లు సీఐ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.

You may also like

Leave a Comment