
11.8kViews
65
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.గురువారం శేరిలింగంపల్లి మదీనాగూడ లోని కిన్నెర గార్డెన్ లో పాస్టర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు కల్పించిందని సేవకుడిగా పనిచేసి ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తానని ప్రతి ఒక్కరు తనను దీవించాలని అన్నారు.నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీలకు అండగా ఉంటానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.దీంతో వారు జగదీశ్వర్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.