
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: సిద్దార్థ్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్స్, క్రియ ఫౌండేషన్ అధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డా. సిద్దార్థ్ రెడ్డి, డా.ఉమా రాణి పర్యవేక్షణ లో అనుభవజ్ఞులైన వైద్యులచే న్యూరోలజీ, గైనాకాలిస్ట్, కార్డీయాలజీ, ఆర్థోపెడిక్, పెడియట్రిక్స్, పుల్మో్నాలజీ, డెంటల్ , ఇఎన్ టి జనరల్ మెడిసిన్ వంటి ముఖ్యమైన వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా, పరీక్షలు, ఎక్సరే, ఎముక సాంద్రత పరీక్ష, ఈసీజీ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి శేరిలింగంపల్లిలోని ప్రజలు కాకుండా పరిసర ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు, వృద్దులు సుమారు..1000 మంది పాల్గొని వైద్య సేవల వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డా. ఉమా రాణి మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా సిద్దార్థ్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల 5 వ తారీఖున మహిళలకు ఉచిత గైనకాలజీ పరీక్షలు నిర్వహిస్తూన్నాము అన్నారు. ఇక ముందు మా హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరింత వైద్య సేవలు అందించాలి అని భావిస్తున్నము. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం సిద్దార్థ్ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ అందిస్తుందని ఆమె తెలిపారు.