Home » కొండాపూర్ సీసీ రోడ్లు,ఫుట్ పాత్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపనలు

కొండాపూర్ సీసీ రోడ్లు,ఫుట్ పాత్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపనలు

by Admin
9.7kViews
108 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ లలోని కాలనీలు, బస్తీల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని శేరిలింగంపల్లి నియోజకవర్గం విప్, శాసన సభ్యులు అరెకపూడి గాంధీ అన్నారు.శనివారం నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ లలోని పలు కాలనీలలో రూ. 5 కోట్ల 41 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, రూపరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కే నిర్మల, మీనా భి, నరసింహ సాగర్, మల్లెల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, శ్రవణ్ యాదవ్, బద్దం శాస్త్రి యాదవ్, సిల్వర్ కుమ్మరి శ్రీనివాస్, ఇంద్రాసేన ముదిరాజ్, సిల్వర్ విష్ణు, రాము ముదిరాజ్, మల్లెల ఐలేష్ యాదవ్, మహేష్ యాదవ్, విక్రమ్, బాలిరెడ్డి, జూపల్లి శ్రీనివాస్, ఎస్వీఎన్ రాజు, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, డా రమేష్, మంగమ్మ, తిరుపతి యాదవ్,రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, అజయ్ సింగ్, శీను ముదిరాజ్, విశ్వేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి,అనిల్, సత్య ప్రసాద్, విజయ్, శివ ముదిరాజ్, సంతోష్, నరేష్ ముదిరాజ్, కచ్చావా దీపక్, సయ్యద్ ఉస్మాన్, హిమమ్, అజయ్, సంతోష్, వివి రావు, హనుమంతు రావు, భగవాన్ దాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment