
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అనేక పనులకు నిధులను కేటాయించిందని శాసన సభ్యులు అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.శనివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ కాలనీలో 61 లక్షల 80 ఎనభై వేల రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోయే విడిసీసీ రోడ్డు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ ( వరద నీటి కాల్వ ) నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దెందుకు కృషి చేస్తున్నానని శాసన సభ్యులు అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.అనేక పనులకు నిధులను కేటాయించిందని, అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు ముందుకు సాగుతున్నారని అన్నారు.పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ రమేష్, ఏఈ జగదీష్ తెరాస నాయకులు పేరుక రమేష్ పటేల్, చాంద్ పాషా, జంగంగౌడ్, శ్రీనివాస్ చౌదరి, బాల రెడ్డి, రజనీకాంత్, మధు ముదిరాజ్, నిర్మల యూత్ నాయకులు దీపక్, కాశెట్టి అంజి, గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. విద్యా సాగర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వి ఎన్ రాజు,ట్రెజరర్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ అమర్ నాథ్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.