Home » కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో లిఫ్ట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో లిఫ్ట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
380Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శనివారం కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో సీడీపీ నిధుల నుండి రూ.23 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ ఆసుపత్రిలో లిఫ్ట్ ను ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు,వృద్దులకు,చిన్న పిల్లలకు ఈ లిఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ ఆసుపత్రిలో ఒకప్పుడూ  40 నుండి 50 వరకు జరిగే ప్రసూతి సేవలు ఇప్పుడు కేసీఆర్ కిట్ వంటి వినూత్న పథకం ద్వారా 200 వరకు ప్రసూతి సేవలునిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజాఅవసరాల దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి  ప్రభుత్వం  కట్టుబడి ఉందని అన్నారు. అంతేకాకుండా  ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు  సహకారంతో త్వరలోనే డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, సిటీ స్కాన్ సెంటర్ ను కూడా ఏర్పాటుకు కృషి చేస్తానని విప్ గాంధీ తెలిపారు.ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటుకు నిధులు మంజూరి చేసి సహకరించినందుకు కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ,రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఝాన్సీ లక్ష్మి,కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.వరదచారీ,హెచ్ ఒడి అఫ్ గైనిక్ డా.కళావతి, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్,శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్,జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్,తెరాస సీనియర్ నాయకులు నరసింహ సాగర్,తిరుపతి, రజినీకాంత్,రూపరెడ్డి,రవి శంకర్ నాయక్, బుడుగు తిరుపతి రెడ్డి,గణపతి,గిరి గౌడ్,యాదగిరి,డా.రమేష్, హనుమంతు రెడ్డి,పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ బిక్షపతి,న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి,వెంకటేష్,రామకృష్ణ,వీరేష్ పాల్గొన్నారు.

You may also like

Leave a Comment