Home » కొండకల్ శంకర్ గౌడ్ కు ఘననివాళి

కొండకల్ శంకర్ గౌడ్ కు ఘననివాళి

by Admin
550Views

*కొండకల్ శంకర్ గౌడ్ ను మరవలేం- గుర్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో వర్థంతి వేడుకలు- ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శేరిలింగంపల్లి ప్రథమ తెరాస నాయకులు స్వర్గీయ కొండకల్ శంకర్ గౌడ్ పాత్ర మరవలేనిదని వర్ధంతి సందర్బంగా మననం చేసుకున్న పార్టీ శ్రేణులు. కొండకల్ శంకర్ గౌడ్ 7వ వర్ధంతి సందర్భంగా తెరాస యువ నాయకులు గుర్ల తిరుమలేశ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో వర్థంతి సందర్బంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.      శేరిలింగంపల్లి నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసిన తెలంగాణ ఉద్యమ కారులు కొండకల్ శంకర్ గౌడ్ అని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు‌ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. కొండకల్ శంకర్ గౌడ్ చిత్ర పటానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో శంకర్ గౌడ్ పాత్ర మరవలేనిదని అన్నారు. శేరిలింగంపల్లి లో ఎంతో మంది నాయకులను, ఉద్యమకారులను తయారు చేసిన ఘనత‌ శంకర్ గౌడ్ కు దక్కిందన్నారు. మన మధ్య లేకున్నా ఏడేళ్లుగా తన గురువును మరవకుండా వర్థంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుర్ల తిరుమలేష్ ను ఎంపీ రంజిత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదన్నారు. శంకర్ గౌడ్ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన వారికి మెమొంటోలను సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండకల్ శంకర్ గౌడ్ గారి కుమారుడు కొండకల్ మహేష్ గౌడ్,శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్,మియపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మిరియాల రాఘవరావు, బిజెపి సీనియర్ నాయకులు కసిరెడ్డీ భాస్కరరెడ్డి, వాలా హరీష్ రావు, గంధం రాములు, డాక్టర్ వెంకట్ రెడ్డి, చందనగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, చందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోబ్బా నవత రెడ్డి, రామస్వామి యాదవ్, గంగాధర్ రావు , గుడ్ల ధనలక్ష్మి, కొండ విజయ్, మిద్దెల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, జేరిపాటి రాజు, ప్రో.పివై రమేష్, ఆశీల శ్యామ్, ఆశీల శివ, దొంతి శేఖర్,కంది జ్ఞానేశ్వర్, గణేష్ రెడ్డి బాబు మోహన్ మల్లేష్, కలివేముల, వేరేశం గౌడ్, ఉమ ప్రభాకర్, బాబుమియా, తాయర్, జమీర్, రాంబాబు, మధు వెంకట్ ఎల్ వెంకటేష్ రావుల జమ్మయ్య ధరం వీర్ సింగ్ తదితర నాయకులు  సీనియర్ పాత్రికేయులు పుట్ట వినయ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment