Home » కేసీఆర్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది : శేరిలింగంపల్లి బిజెపి నాయకులు

కేసీఆర్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది : శేరిలింగంపల్లి బిజెపి నాయకులు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అధ్యక్షతన చందానగర్ డా.అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని అన్నారు. బీజేపీ శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడమేంటనీ అన్నారు.బీజేపీ పార్టీ ఎదుగుదలను చూస్తుంటే కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు.శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉండాలని కోరినందుకు బిజెపి పార్టీ ఎమ్మెల్యేలను శాసన సభ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.కేసీఆర్ నియంత పోకడలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని తెరాస ప్రభుత్వానికి చివరి బడ్జెట్ సమావేశాలు ఇవేనని ఎద్దేవా చేశారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం తధ్యమన్నారు.కార్యకర్తలంతా ఏకతాటిపైకి ఉండి కష్టపడి పని చేయాలని సూచించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ సమీక్ష సమావేశంలో పాల్గొని వివిధ కమిటీ లపై చర్చించి నియోజకవర్గంలో పార్టీ బలోపతానికి చేయవలసిన కృషిని నాయకులకు ,కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్,రాష్ట్ర నాయకులు,ఎండల లక్ష్మీనారాయణ,గజ్జల యోగానంద్,మువ్వ సత్యనారాయణ,రవికుమార్ యాదవ్, బుచ్చిరెడ్డి, కసిరెడ్డి సింధు రెడ్డి,నాగేశ్వర్ గౌడ్,రాధ కృష్ణ యాదవ్,రఘునాథ్ యాదవ్, మహిపాల్ రెడ్డి, కుమార్ యాదవ్, రమేష్,రాంరెడ్డి, రాజు శెట్టి,శ్రీధర్ రావు,హరి ప్రియ, తేందర్, కాంచన కృష్ణ,పద్మ, మహిళా మోర్చా నాయకురాళ్ళు, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment