Home » కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

by Admin
690Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  కొత్త సంవత్సరంలో పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు  మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్,సబితా ఇంద్రారెడ్డి,  ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , సురభి వాణి దేవి ,శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ ,ఎమ్మెల్యేలు ,మాగంటి గోపీనాథ్ ,ముఠా గోపాల్  డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి , జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  జోనల్ కమిషనర్లు  రవి కిరణ్  ప్రియాంక అల,ప్రాజెక్ట్స్ శ్రీధర్ లు పాల్గొన్నారు.అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ,రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌తో ఏ నగరం పోటీ పడలేదన్నారు. షేక్‌పేట ప్లైఓవర్‌ ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి. ఏడున్నారేళ్లుగా ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీలో పెద్దఎత్తున రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హైదరాబాద్‌ నగరంలో పెద్దఎత్తున లింక్‌ రోడ్లు నిర్మించామన్నారు. 132 కొత్త లింక్‌ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజినల్‌ రింగ్‌రోడ్‌ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చాలా పురోగతి సాధించాం అన్నారు. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. ఆర్ బి ఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ దేశానికి ఆర్థిక అభివృద్ధిలో నాలుగోవ పెద్ద రాష్ట్రంగా గుర్తింపునిచ్చిందన్నారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ  హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు వస్తే దేశంలో భాగ్యనగరంను మించిన నగరం ఏది ఉండదన్నారు. రసూల్ పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు మూసివేత స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు. కిషన్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి కంటోన్మెంట్ రోడ్లు తెరిచేలా చొరవ తీసుకోవాలన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడేందుకు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ కు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావాలన్న కేటీఆర్.. భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన హైదరాబాద్ ను అందించాల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  హమీద్ పటేల్ , గంగాధర్ రెడ్డి గారు, రషీద్ ఫరాజుద్దీన్ , రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , పూజిత జగదీశ్వర్ గౌడ్ , రోజాదేవి రంగరావు ,మంజుల రఘునాథ్ రెడ్డి,ప్రాజెక్ట్స్ అధికారులు ఎస్ ఈ వెంకటరమణ,ఈఈ కిష్టప్ప,డీఈ  రాంచందర్, తెరాస నాయకులు ,మహిళ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment