
11.8kViews
121
Shares
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : ఆన్లైన్ గేమ్స్ మరో కుటుంబం లో విషాదం నింపింది. హైదరాబాద్ లోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ప పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి కి చెందిన చంద్రయ్య, శశికళ దంపతుల కొడుకు రాజశేఖర్ గత కొంత కాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్నాడు. గత ఏడాదిగా ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్ లకు బానిసైన రాజశేఖర్, ఏడాదిలోనే 4లక్షల నగదు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిన రాజశేఖర్ ఇంట్లో నుండి బంగారం తీసుకొని ఆడి పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు అరా తియడంతో మానస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.