
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కి నూతనంగా ఏర్పడిన కాలనీ అసోసియేషన్ సభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. కాలనీ లో రోడ్ల నంబర్ 2,3,4 గల రోడ్లను మంజూరి చేసి రోడ్లు వేయగలరని ,డ్రైనేజి, విధి దీపాల సమస్యలను పరిష్కరించాలని గౌరవ ప్రభుత్వ విప్ గాంధీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. త్వరలోనే డ్రైనేజి ,రోడ్లు వంటి మౌలిక వసతులు కలిపిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, సిద్దిక్ నగర్ వాసులు బసవ రాజు , యాదగిరి గౌడ్, నందు ,రాములు,లక్ష్మీ బాయి , గోపాల్ గౌడ్, మహేష్ , మనెమ్మ ,పాతిమా తదితరులు పాల్గొన్నారు.