
శేరిలింగంపల్లి(తెలంగాణ మిర్రర్) : పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రులతో సమానమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో పని చేస్తున్నపారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ద్వారా పీపీఈ కిట్లను వైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి ,కార్పొరేటర్లు రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి అరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలోపంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయాలలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో విలువైన సేవలను అందించారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన వారి సేవలను ఎన్నటికీ మరిచిపోలేమని, అందుకే ప్రభుత్వం వీరిని గుర్తించి అదనపు వేతనాలు సహా పలు రకాలుగా ప్రోత్సహించిందన్నారు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పని చేస్తున్న కార్మికులను గౌరవప్రదంగా చూడాలని ఆయన కోరారు. కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పిస్తున్నదని, విధి నిర్వహణలో కీలకంగా ఉపయోగపడేందుకు పీపీఈ కిట్లను అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అన్ని రకాలుగా తోడ్పాటును కల్పిస్తూ వారిని కాపాడుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.పిలు సత్యనారాయణ ,నాయక్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పోతుల రాజేందర్, శ్రీనివాస్ చౌదరి, ఎల్లంనాయుడు, తిరుపతి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.