Home » కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలు : విప్ గాంధీ,కార్పొరేటర్ రాగం

కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలు : విప్ గాంధీ,కార్పొరేటర్ రాగం

by Admin
12.5kViews
64 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సకల వసతులు, సదుపాయాలను సర్కారు దవాఖానల్లో కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లిలో డిప్యూటీ డిఏంహెచ్ఓ సృజన, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా హాజరై బస్తీ దవాఖానను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అంటే నే భయపడే రోజులుండేవని, ఇ ప్పుడు కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సకల వసతులు, సదుపాయాలను సర్కారు దవాఖానల్లో కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేశామన్నారు.బస్తీ దవాఖానలో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్స్‌, ఒక నర్స్‌తో పాటు, మందులు, రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు.కార్యక్రమంలో శేరిలింగంపల్లి పిహెచ్ సి వైద్యాధికారి శైలజ, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్ ,రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, రాంచందర్, వేణు గోపాల్ రెడ్డి,కవిత, నటరాజు, రమణయ్య, పవన్,గోపాల్ యాదవ్, రవి యాదవ్, గఫుర్, నర్సింహ రెడ్డి, మహేష్, అలీ, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment